ఇంటరెస్టింగ్‌‌గా, ఎంగేజింగ్‌‌గా ది ట్రయల్

ఇంటరెస్టింగ్‌‌గా, ఎంగేజింగ్‌‌గా  ది ట్రయల్

స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ది ట్రయల్’. రామ్ గన్ని దర్శకత్వంలో స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు.  సుదర్శన్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌‌‌‌గా వ్యవహరించారు. నవంబర్ 24న సినిమా విడుదల కానుంది. ఆదివారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను హీరో శ్రీవిష్ణు రిలీజ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ఇదొక థ్రిల్లర్ జానర్. ఇంటరెస్టింగ్‌‌గా, ఎంగేజింగ్‌‌గా ఉన్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 

సబ్  ఇన్‌‌స్పెక్టర్ మిసెస్ రూప, ఆమె భర్త అజయ్ వాళ్ళ మొదటి మ్యారేజ్ యానివర్సరీని జరుపుకుంటున్నప్పుడు అనుకోని సమయంలో అజయ్  బిల్డింగ్‌‌పై నుంచి పడి చనిపోతాడు. ఇది మీడియాలో పెద్ద న్యూస్ అవుతుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్.. రూప తన భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందని అనుమానిస్తాడు. ఆమెను ఇంటరాగేట్ చేస్తాడు. రూప మాత్రం తన భర్తది ఆత్మహత్యేనని గట్టిగా చెబుతుంది. 

ఇంతకీ అజయ్ ది హత్యా?, ఆత్మహత్యా?, హత్యే అయితే పోలీస్ ఆఫీసర్ అయిన రూప తన భర్తనే ఎందుకు చంపింది అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తి కలిగించింది.  ఇప్పటిదాకా తెలుగు తెరపై చూడని కంప్లీట్ ఇంటరాగేటివ్ కథతో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌‌పీరియెన్స్ ఇస్తుందని మేకర్స్ నమ్మకంతో చెబుతున్నారు.