వెరీ ఎంగేజింగ్ థ్రిల్లర్ ఇది: హీరో సుధీర్ బాబు

వెరీ ఎంగేజింగ్ థ్రిల్లర్ ఇది: హీరో సుధీర్ బాబు

సుధీర్ బాబు పోలీస్‌‌ ఆఫీసర్‌‌‌‌గా నటించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌‌ ‘హంట్’. మహేష్ దర్శకుడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. జనవరి 26న సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా సుధీర్ బాబు చెప్పిన విశేషాలు. 

‘‘వెరీ ఎంగేజింగ్ థ్రిల్లర్ ఇది. అర్జున్ ఎ, అర్జున్ బి అనే రెండు వేరియేషన్స్‌‌ ఉన్న పాత్రలో కనిపిస్తాను. గతం మర్చిపోకముందు పోలీస్ క్యారెక్టర్ క్లియర్‌‌‌‌గా ఉంటుంది. గతం మర్చిపోయిన పాత్రకోసం కాస్త కష్టపడ్డాను.  ఇందులో హీరోయిన్ లేదు. రెండు నిమిషాల్లోనే కథలోకి వెళ్ళిపోతారు. లాంగ్ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. యాక్షన్ అంతా రియల్‌‌గా ఉండాలని 'జాన్ విక్' సినిమాలను రిఫరెన్స్ తీసుకున్నాం. ఫారిన్ ఫైటర్స్‌‌తో  నాలుగు రోజుల్లోనే అన్ని యాక్షన్ సీక్వెన్సులు షూట్ చేశాం. ఇక్కడైతే వాటికోసం ఇరవై రోజులకుపైగా పడుతుంది. యాక్షన్ సీక్వెన్సులు ఉన్నా ఎంత వరకు ఉండాలో అంతే ఉంటాయి. సినిమా కోర్ పాయింట్ ఎమోషనే. సినిమాలో ప్రేమకథ లేదు. ఫ్రెండ్‌‌షిప్ మీద ఎక్కువ ఎమోషన్ ఉంటుంది. భరత్‌‌తో నా కాంబినేషన్‌‌ సీన్స్ ఫ్రెష్‌‌గా ఉంటాయి. శ్రీకాంత్ పాత్ర ఉన్నంత సేపూ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పటివరకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహా వందమందికిపైగా ఈ సినిమా చూశారు. అందరూ బాగుందని చెప్పడంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. హర్షవర్ధన్ దర్శకత్వంలో 'మామా మశ్చీంద్ర' సినిమా చేస్తున్నా. ఇది కామెడీ అండ్ యాక్షన్ జానర్ సినిమా. అందులో ట్రిపుల్ రోల్‌‌లో కనిపిస్తా. యువి క్రియేషన్స్‌‌లో ఓ సినిమా ఉంది. తండ్రీ కొడుకుల మధ్య జరిగే డ్రామా అది. మరో రెండు ప్రాజెక్టులు పైప్‌‌లైన్‌‌లో ఉన్నాయి’’.