హిట్స్, ఫ్లాప్స్‌‌‌‌కు బాధ్యుడ్ని నేనే: సుధీర్ బాబు

హిట్స్, ఫ్లాప్స్‌‌‌‌కు బాధ్యుడ్ని నేనే: సుధీర్ బాబు

సుధీర్ బాబు హీరోగా  సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్   కీలక పాత్రల్లో  నటించిన  సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు.  జీ స్టూడియోస్‌‌‌‌,  ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్  నిర్మించిన ఈ చిత్రం  నవంబర్ 7న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌కు హాజరైన దర్శకుడు శైలేష్ కొలను సినిమా సక్సెస్ సాధించాలని టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.  సుధీర్ బాబు మాట్లాడుతూ ‘ ఒక్క సినిమా చాలు అనుకున్న వాడిని 20 సినిమాలు చేశా. అందులో హిట్స్, ఫ్లాప్స్ ఉన్నాయి. వాటన్నింటికీ బాధ్యుడ్ని నేనే.   

నేను చేసిన 20 సినిమాల్లో ది బెస్ట్ స్క్రిప్ట్ ఇది.  ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టర్ ఏ హీరో చేయలేదు.  ఘోస్ట్  హంటర్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తా.   ఈ సినిమా దెయ్యాలు దేవుడు ఉన్నాయని నమ్మేవారికి, లేవని నమ్మేవారికి ఇద్దరికీ సమానంగా నచ్చుతుంది.  ప్రతి దానిని  సైంటిఫిక్ రీజన్‌‌‌‌తో చెప్పాం.  ఇందులో  శివతాండవం చేయడం అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది.  

శివుని గురించి చాలా మంచి ఎపిసోడ్స్ ఉంటాయి. అరుణాచలం వెళ్లే వాళ్ళు ఈ సినిమాకు ఇంకా కనెక్ట్ అవుతారు’ అని చెప్పాడు.  ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుందని శిల్పా శిరోద్కర్ చెప్పారు. ఈ సినిమాలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా పెర్ఫార్మెన్స్‌‌‌‌లు అందరినీ అలరిస్తాయని నిర్మాతలు శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా అన్నారు.