Suhas Movie: చివరి నిమిషంలో సుహాస్ మూవీ రిలీజ్ వాయిదా..మళ్లీ ఎప్పుడు వస్తుందంటే?

Suhas Movie: చివరి నిమిషంలో సుహాస్ మూవీ రిలీజ్ వాయిదా..మళ్లీ ఎప్పుడు వస్తుందంటే?

టాలీవుడ్  టాలెంటెడ్ నటుడు సుహాస్ (Suhas) ఈ మధ్య వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా అమ్మాజీపేట మ్యారేజి బ్యాండ్, ప్రసన్న వదనం వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత జనక అయితే గనక (Janaka Aithe Ganaka) మూవీతో వస్తున్నాడు. 

సుహాస్, సంగీర్తన జంటగా సందీప్ రెడ్డి బండ్ల రూపొందించిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై శిరీష్ స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ర్పణ‌‌‌‌‌‌‌‌లో బలగం ఫేమ్ హ‌‌‌‌‌‌‌‌ర్షిత్ రెడ్డి, హ‌‌‌‌‌‌‌‌న్షిత నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఈ సినిమాను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ బుధవారం (సెప్టెంబర్ 4) అధికారికంగా అనౌన్స్ చేశారు.

ALSO READ | Daavudi: దేవర దావుడి ప్రోమో అదిరింది..ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ..వచ్చేస్తోంది

"ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితుల కారణంగా సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.సెప్టెంబర్ 7 న విడుదల కావాల్సిన జనక అయితే గనక మూవీ త్వరలో మిమ్మల్ని కలుస్తుంది" అంటూ ట్విట్టర్ X లో మేకర్స్ పోస్ట్ చేశారు. అయితే, కొత్త రిలీజ్ డేట్ ను మాత్రం మేకర్స్ వెల్లడించలేదు. దీంతో ప్రస్తుతానికి నిరవధికంగా వాయిదా పడినట్లే.

ఆనందం పట్టలేనంత..బాధలు చెప్పుకోలేనంత..నవ్వులు ఆపుకోలేనంత..” అనే విధంగా సినిమా ఉంటుందని మేకర్స్ క్యాప్షన్ ద్వారా చెప్పుకొచ్చారు.దీన్ని బట్టి ఆలోచిస్తే..ఈ సినిమా ఆద్యంతం  కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు విభిన్నమైన ట్యూన్స్ తో అలరించే విజయ్ బుల్గ‌నిన్ సంగీతాన్ని అందించాడు. 

జనక అయితే గనక స్టోరీ లైన్:

ఓ సాదాసీదా సేల్స్ మ్యాన్ ఉద్యోగం చేసే హీరో.. ఖర్చులకు భయపడి పెళ్లి చేసుకున్నా అప్పుడే పిల్లలు వద్దనుకుంటాడు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అతని భార్య గర్భం దాలుస్తుంది. దీంతో సుహాస్ కండోమ్ తయారు చేసే సంస్థపైనే కేసు వేస్తాడు.ఇక సుహాస్ తనదైన కామెడీతో టీజర్, ట్రైలర్ విజువల్స్ లో చూపించాడు. ఇక ప్రమోషన్స్ తో ఈ సినిమాపై హైప్ పెంచేశాడు.