
సుహాస్, మాళవిక మనోజ్ జంటగా రామ్ గోధల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. జులై 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. లవ్, కామెడీ, ఎమోషనల్ సీన్స్‌తో కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్న ఓ యువకుడి జీవితం ప్రేమలో పడ్డాక ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది మూవీ మెయిన్ కాన్సెప్ట్ అని అర్థమవుతోంది. దర్శకులు హరీష్ శంకర్, మారుతి అతిథి పాత్రల్లో కనిపించారు.
►ALSO READ | VirginBoys: ఆడియెన్స్‌కు ‘వర్జిన్ బాయ్స్’ నిర్మాత ఆఫర్స్.. టికెట్ కొంటే ఐఫోన్, థియేటర్లలో డబ్బుల వర్షం
‘నువ్వు నేను’ఫేమ్ అనిత రీ ఎంట్రీ ఇస్తోంది. పెళ్లి పృథ్వి, రవీందర్ విజయ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, నయన్ పావని ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. రధన్ సంగీతం అందిస్తున్నాడు.
‘సుహాస్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిస్తున్నాం. క్యూట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో లవ్ సీన్స్ అలరించడంతో పాటు ప్రతి సీన్ ఎంటర్‌టైన్ చేస్తుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’ అని దర్శకనిర్మాతలు తెలియజేశారు.