ఆసక్తికరమైన టైటిల్‌‌ తో.. సూర్య 46వ మూవీ

ఆసక్తికరమైన టైటిల్‌‌ తో.. సూర్య 46వ మూవీ

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సూర్య కెరీర్‌‌‌‌లో ఇది 46వ చిత్రం. బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌‌లో మొదలైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో  శరవేగంగా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.  ఇప్పటికే  ఓ సాంగ్ షూట్ చేయగా, ప్రస్తుతం సూర్యపై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ టైటిల్ విషయంలో ఓ న్యూస్ ప్రచారంలో  ఉంది. 

ఈ చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌‌ పరిశీలనలో ఉందని తెలుస్తోంది.  ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు ఇందులో సూర్యకు జంటగా నటిస్తోంది. రవీనా టాండన్ టాలవుడ్‌‌కు  రీఎంట్రీ ఇస్తుండగా రాధిక శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌‌‌‌లో రిలీజ్ కానుంది.