
ఫాంటసీతో గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే చిత్రం ‘మిరాయ్’ అని తేజ సజ్జా చెప్పాడు. తను హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా తేజ చెప్పిన విశేషాలు.
‘‘ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఫిల్మ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ అడ్వెంచర్, ఫాంటసీ, ఎమోషన్, డివోషనల్ ఎలివేషన్ అన్నీ ఉంటాయి. పిల్లలతో సహా ప్రతి ఒక్కరికీ మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ప్రేక్షకులకు ఇంటర్నేషనల్ స్థాయి సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతో వర్క్ చేశాం. మన ఇతిహాసాలతో చాలా ఆర్గానిక్‌గా బ్లెండ్ చేసిన కథ ఇది. మైథాలజీతో చిన్న పోర్షన్ ఉన్నప్పటికీ వచ్చినప్పుడు స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఒక మామూలు కుర్రాడు.. యోధులతో తనకు ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని, ఒక పెద్ద ఆపదని ఆపడానికి ఎంత దూరం వెళ్తాడు, తన తల్లి ఆశయం కోసం ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా సాగుతుంది.
ఇతిహాసాల్లో ఉన్న సమాధానం కోసం జర్నీ చేసే క్యారెక్టర్‌లో నేను కనిపిస్తాను. శ్రియ గారు, జగపతిబాబు గారితో చిన్నప్పుడు కలిసి నటించాను. వాళ్ళందరితో మళ్ళీ ఇప్పుడు వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మనోజ్ చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఒక జీవితాన్ని చూసి వచ్చిన పాత్ర ఆయనది. ఆ పాత్రకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఇందులో తొమ్మిది యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ఆడియెన్స్‌ను థ్రిల్ చేసేలా ఉంటుంది.
అలాగే ఈ సినిమాలో రెండు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత చిరంజీవి గారి నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ రావడం హ్యాపీగా అనిపించింది. ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ గారు మాకు చాలా ఫ్రీడమ్ ఇవ్వడం వలన మరింత బాధ్యతగా వర్క్ చేశాం. ఫ్రాంచైజ్ చేసే పొటెన్షియాలిటీ ఉన్న కథ ఇది. సినిమా హిట్ అయితే కచ్చితంగా పార్ట్ 2 వస్తుంది’’.