టాలీవుడ్‌‌లోనూ హీరో విజయ్‌‌కి మంచి మార్కెట్

టాలీవుడ్‌‌లోనూ హీరో విజయ్‌‌కి మంచి మార్కెట్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌‌కి టాలీవుడ్‌‌లోనూ మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు మూవీతో మరింత ఇమేజ్ పెంచుకోవాలనుకుంటున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌‌లో విజయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బైలింగ్వల్  మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం తెలుగులో ‘వారసుడు’ టైటిల్‌‌తో రాబోతోంది. తమిళంలో ‘వారిసు’గా రూపొందుతోంది.  దాదాపు షూటింగ్ పూర్తిచేసిన టీమ్.. లాస్ట్ షెడ్యూల్‌‌ను నిన్న మొదలుపెట్టారు. రెండు యాక్షన్ సీక్వెన్స్‌‌లు, రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ షెడ్యూల్‌‌తో ఇవి కూడా పూర్తిచేయనున్నట్టు చెప్పారు. అలాగే సినిమా రిలీజ్ డేట్‌‌ని కూడా అనౌన్స్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రష్మిక హీరోయిన్‌‌గా నటిస్తోంది.  

శరత్  కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ,  సంగీత, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు, పీవీపీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే పొంగల్ రేసులో కొన్ని  భారీ సినిమాలు బెర్త్ ఖరారు చేసుకున్నాయి.  కోలీవుడ్‌‌ నుంచి అజిత్ సినిమా కూడా సంక్రాంతి రిలీజ్‌‌కి ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.  అజిత్‌‌కి పొంగల్ సెంటిమెంట్ ఉండటంతో.. మరోసారి ఇద్దరికీ పోటీ తప్పేలా కనిపించడం లేదు.