ఒక నిమిషం తేడాతో పుష్ప2 రికార్డ్ ఔట్.. వేట మొదలుపెట్టిన విజయ్

ఒక నిమిషం తేడాతో పుష్ప2 రికార్డ్ ఔట్.. వేట మొదలుపెట్టిన విజయ్

కేవలం ఒకే ఒక నిమిషం తేడాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) పేరుమీద ఉన్న రికార్డ్ బద్దలైపోయింది. ఇండియా వైడ్ గా ఆ రికార్డ్ సాధించిన హీరోగా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు సెకండ్ పొజిషన్ కు వచ్చేశాడు. ఇంతకీ ఆ రికార్డ్ బ్రేక్ చేసిన హీరో మరెవరో కాదు తమిళ స్టార్ హీరో తలపతి విజయ్(Thalapathy Vijay). ఇంతకీ ఆ రికార్డ్ ఏంటా అని అలోచూస్తున్నారా. 

ALSO READ: OTTలో కొంత కంటెంట్.. ఈ వారం ఏకంగా 20 సినిమాలు

విజయ్ తలపతి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ లియో. స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇంద మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్స్ అండ్ పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. తాజాగా సెకండ్ సాంగ్ అప్డేట్ ఇస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ పోస్టర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఎంతలా అంటే.. కేవలం 32 నిమిషాల్లోనే 10 లక్షల లైక్స్ వచ్చేంతలా. అవును ఈ పోస్టర్ రిలాజైన కేవలం 32 నిమిషాల్లోనే పది లక్షలకు పైగా లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 

ఇంతకు ముందు ఈ రికార్డ్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2 పోస్టర్ మీద ఉండేది. అమ్మోరు అవతారంలో ఐకాన్ స్టార్ విశ్వరూపంగా వచ్చిన పోస్టర్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పోస్టర్ 33 నిమిషాల్లో పదిలక్షల లైక్స్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది విజయ్ తలపతి లియో మూవీ. ఇండియా లెవల్లో ఈ రికార్డ్ ఉన్న ఏకైక హీరోగా విజయ్ నిలిచారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇక లియో సినిమా విషయానికి వస్తే.. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ డాట్, యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్స్ చేస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. అక్టోబర్ 19న ప్రేక్షుకుల ముందుకు రానుంది.