
అవార్డులపై హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేశాడు. తనకు అవార్డులపై నమ్మకం లేదన్న ఆయన.. ఒకవేళ అవార్డులు వస్తే వాటిని చెత్తబుట్టలో పడేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాల్ లేటెస్ట్ గా నటించిన ‘మార్క్ ఆంటోని’ సినిమా వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 15న సినిమా విడుదల కానుంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ జాతీయ ఆవార్డులపై మాట్లాడారు.
అవార్డులపై తనకు అస్సలు నమ్మకం లేదన్న విశాల్.. ప్రజలందరూ కలసి ఇచ్చేదే నిజమైన అవార్డన్నారు. ప్రేక్షకుల ఆశీస్సులతో ఇన్నేళ్లపాటు పరిశ్రమలో నిలదొక్కుకుంటూ చిత్రాల్లో నటిస్తున్నా. నిజానికి అదే తనకు పెద్ద అవార్డు అని చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను నటించిన చిత్రాలకు అవార్డు వచ్చినా వాటిని చెత్తబుట్టలో పడేస్తానంటూ విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడిన విశాల్.. జీవితంలో ఏదైనా జరగొచ్చు.. అది మన చేతుల్లో లేదంటూ కామెంట్ చేశారు.
అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మార్క్ ఆంటోని సినిమాను మినీ స్టూడీయోస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై ఎస్. వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. జీ.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. విశాల్‌కు జోడీగా రీతూవర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. సినిమాపై మంచి అంచనాలున్నాయి.