ఇదొక కొత్త ఫార్ములాతో వస్తున్న సినిమా

ఇదొక కొత్త ఫార్ములాతో వస్తున్న సినిమా

విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈరోజు సినిమా విడుదలవుతున్న సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘తెలుగులో ఇదొక కొత్త ఫార్ములాతో వస్తున్న సినిమా. కమర్షియల్ అంశాలు ఉంటూనే కొత్తగా ఉంటుంది. మంచి సినిమా చేశానని సంతృప్తి కలిగింది. నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఇందులో గోదావరి యాసలో డైలాగ్స్ చెప్పేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నా. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలు ఒకెత్తయితే.. ఈ సినిమా మరో ఎత్తు అనేలా ఉంటుంది’ అని చెప్పాడు.  

నాగ వంశీ మాట్లాడుతూ ‘గోదావరి ప్రాంతానికి చెందిన లంకల రత్న అనే ఒక స్లమ్ కుర్రాడు.. రాజకీయాలను వాడుకొని ఎలా ఎదిగాడు అనేది ఈ చిత్ర కథ.  లంకల రత్న పాత్ర అందరికీ నచ్చుతుంది. విశ్వక్ నట విశ్వరూపం చూస్తారు. తనతో పాటు అంజలి, నేహా శెట్టి, గోపరాజు రమణ పాత్రల చుట్టూనే కథ ఉంటుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ హైలైట్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తుంది’ అని తెలియజేశారు.