Gangs of Godavari: రచ్చ రేపేలా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ట్రైల‌ర్..ఆడ, మగ, పొలిటీషియన్స్..లంకల రత్న కిరాక్

Gangs of Godavari: రచ్చ రేపేలా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ట్రైల‌ర్..ఆడ, మగ, పొలిటీషియన్స్..లంకల రత్న కిరాక్

రైటర్..డైరెక్టర్..హీరో..విశ్వక్ సేన్ (Vishwaksen) నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే మాస్ మాస్టర్ పీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ విషయానికి వస్తే..

1990 రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో..సముద్రం ఒడ్డున నివసించే సాధారణ హీరో..ఊహించని స్థాయిలో పెద్ద నాయకులను ఎదిరించి..వారికి దీటుగా ఎలా నిలిచాడు అనేది ఈ మూవీలోని అసలు కథ అని తెలుస్తోంది. ఇందులో హీరో విశ్వక్ సేన్ “లంకల రత్న” అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు ఇంతవరకూ బాడీ లాంగ్వేజ్ పరంగా..డైలాగ్ డెలివరీ పరంగా మాత్రమే మాస్గా కనిపించిన విశ్వక్ ఈ సినిమాలో మాస్ లుక్ తోనే కనిపిస్తున్నారు.

అంతేకాదు ట్రైలర్ లో ఆకట్టుకునే పోరాట సన్నివేశాలు, బలమైన భావోద్వేగాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మనుషులను మూడు వర్గాలుగా వివరించే పాత్రతో ట్రైలర్ షురూ కాగా..హీరో వారిని “మగ”, “ఆడ” మరియు “రాజకీయ నాయకులు”గా వర్గీకరించడంతో ట్రైలర్ ముగుస్తుంది. అలాగే, లంకల రత్న పలికే సంభాషణలు ట్రైలర్ కే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఈ సినిమా మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ‘సుట్టంలా సూసి’ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సాంగ్ లో నేహా శెట్టి విశ్వక్ సేన్ క్యూట్ స్టెప్స్ తో అదరగొట్టారు.ఆ తరువాత రిలీజ్ చేసిన “మోత” గీతం మాస్ ప్రేక్షకులని ఊపేస్తోంది. మరి సినిమా రిలీజ్  అయ్యాక ఎలాంటి అంచనాలు అందుకోనుందో చూడాలి.

ఈ GOG డైరెక్టర్ కృష్ణ చైతన్య..లిరిక్ రైటర్ గా సినిమా కెరీర్ ను స్టార్ట్ చేసి రౌడీ ఫెలో,చల్ మోహన్ రంగా వంటి మూవీస్ తో డైరెక్టర్ గా తనలోని టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో తనలోని విభిన్నతను చూపించబోతున్నారు. హీరో విశ్వ క్ సేన్ రీసెంట్ మూవీ దాస్ కా దామ్కి మూవీతో సక్సెస్ అందుకున్నారు.

 ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీకర స్టూడియోస్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించనున్నారు.