తెరచాప ఫస్ట్ లుక్ బాగుంది

తెరచాప ఫస్ట్ లుక్ బాగుంది

నవీన్ రాజ్  సంకరపు, పూజా సుహాసిని లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో జోయల్‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తెరచాప’.  కైలాష్‌‌‌‌‌‌‌‌ దుర్గం నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హీరో విశ్వక్ సేన్ లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కథ, కథనం, టేకింగ్‌‌‌‌‌‌‌‌, నిర్మాణ విలువలు అన్ని విషయాలు నాకు తెలుసు. టైటిల్‌‌‌‌‌‌‌‌ డిజైనింగ్‌‌‌‌‌‌‌‌ చాలా బాగుంది. సినిమా సక్సెస్ సాధించి టీమ్ అందరికీ  మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ఆల్‌‌‌‌‌‌‌‌ ద బెస్ట్‌‌‌‌‌‌‌‌’ అని చెప్పాడు. శ్రీలు, జగదీష్‌‌‌‌‌‌‌‌ ప్రతాప్‌‌‌‌‌‌‌‌ బండారి, రాజీవ్‌‌‌‌‌‌‌‌ కనకాల, పృధ్వీరాజ్‌‌‌‌‌‌‌‌, ఫిష్‌‌‌‌‌‌‌‌ వెంకట్‌‌‌‌‌‌‌‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.