
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అలియా భట్ ఇప్పుడు హాలీవుడ్ బాట పట్టింది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానుంది. తాజాగా సహనటులతో కలిసి ఓ మూవీ ప్రమోషన్లో పాల్గొంది. అయితే, మీడియా ఇంటరాక్షన్ టైంలో అలియా ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. తనతో ఉన్న వారు మాట్లాడుతున్న సమయంలో అలియా వారి మొహాలు చూస్తూ కూర్చోవడం, చేతి వేళ్లతో జుట్టును రింగులు తిప్పుకోవడం వంటివి చూసి ఇలాగేనా ప్రవర్తించేది అంటూ ఆమెను విమర్శిస్తున్నారు. కూర్చేనే విధానమే నిర్లక్ష్యంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే కూడా ఇంటర్నేషనల్ మీడియాలో మాట్లాడారని వారితో పోలిస్తే అలియా తీరు ప్రొఫెషనల్‌గా లేదని అంటున్నారు.