హెరాయిన్, డ్రగ్స్ సప్లై ముఠా అరెస్ట్

హెరాయిన్, డ్రగ్స్ సప్లై ముఠా అరెస్ట్

మెహిదీపట్నం, వెలుగు:  హెరాయిన్ డ్రగ్స్ సరఫరా చేసే ముఠాను ఈస్ట్ జోన్ ట్రాస్స్ ఫోర్స్, గుడిమల్కాపూర్ పోలీసులు దాడులు చేసి ముగ్గురు రిమాండ్ కు పంపారు.  గుడిమల్కాపూర్ పోలీసుల తెలిపిన ప్రకారం.. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన మాన్ సింగ్ బటాల అలియాస్ తేజ (28) ప్రైవేటు ఉద్యోగి. టోలిచౌకి అక్బర్ పురాకు చెందిన సయ్యద్ బబైద్ (26) ప్రైవేటు ఉద్యోగి. లంగర్ హౌస్ సర్దార్ బాగ్ కు చెందిన షబ్బర్ హుస్సేన్(30). వీరు స్కూల్ నుంచి ఫ్రెండ్స్.  అయితే ఎంజాయ్ చేసేందుకు కొంతకాలంగా లంగర్ హౌస్ కు చెందిన పరిచయస్తులు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు.  

మాన్ సింగ్ బెంగళూరులోని ఓ నైజీరియన్  ద్వారా డ్రగ్స్ ను సేకరించాడు. రేతిబౌలి ఎక్స్ రోడ్ లోని కాస్ట్ టూ కాస్ట్ షాప్ లో డ్రగ్స్ సేకరించేందుకు సయ్యద్ బబైద్, శబ్బర్ హుస్సేన్ లను సంప్రదించాడు. పక్క సమాచారం మేరకు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, గుడిమల్కాపూర్ పోలీసులు దాడిని నిర్వహించి ముగ్గురిని పట్టుకున్నారు. వీరి వద్ద 7 గ్రాముల జీఎంఎస్ హెరాయిన్ డ్రగ్స్, మూడు సెల్ ఫోన్లు ఒక హోండా యాక్టివాను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకొని గురువారం రిమాండ్ కు తరలించారు.