Vishwambhara: చిరంజీవితో ఆషిక రంగనాథ్.. స్ట్రాంగ్ అప్డేట్ ఇచ్చిన విశ్వంభర టీమ్

Vishwambhara: చిరంజీవితో ఆషిక రంగనాథ్.. స్ట్రాంగ్ అప్డేట్ ఇచ్చిన విశ్వంభర టీమ్

అమిగోస్(Amigos) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ఆషిక రంగనాథ్(Ashika Ranganath). కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ అవలేదు. అందుకే ఈ సినిమా తరువాత పెద్దగా అవకాశాలు అందుకోలేదు ఈ బ్యూటీ. చాలా రోజుల తరువాత కింగ్ నాగార్జునతో నా సామిరంగా సినిమా చేసింది ఆషిక. విజయ్ బిన్నీ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో వయసుకు మించిన పాత్రలో కనిపించిన ఆషిక తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. 

ఈ సినిమా మంచి విజయాన్ని సాదించినప్పటికీ అవకాశాలు రావడం లేదు ఈ బ్యూటీకి. తాజా సమాచారం మేరకు ఆషికకి బంపర్ ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది. అవును.. మెగాస్టార్ హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న విషయం తెల్సిందే. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 

Also Read: ఎన్టీఆర్కు జోడీగా రష్మిక.. ఏ సినిమా కోసమో తెలుసా?

అయితే ఈ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుందట ఆషిక. సినిమాలో కథ రీత్యా చిరంజీవికి ఐదుగురు చెల్లెల్లు ఉంటారని సమాచారం. అందులో ఒక పాత్రకి ఆషికను తీసుకున్నారట మేకర్స్. పాత్రకి ప్రాధాన్యం ఉండటంతో ఆషిక కూడా వెంటనే ఒకే చెప్పేశారట. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక విశ్వంభర సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్స్ లోకి రానుంది.