కింగ్డమ్ మూవీకి భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ కంప్లీట్..

కింగ్డమ్ మూవీకి భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ కంప్లీట్..

గతేడాది ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. తన నుంచి రాబోతున్న చిత్రాల్లో ‘కింగ్డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌గా నటించింది. తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం కంప్లీట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె డబ్బింగ్ చెబుతున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

బ్రదర్ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు.  శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.  ఈ నెల 31న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా సినిమా విడుదల కానుంది. తెలుగులో  ‘కింగ్డమ్’గా రిలీజ్ అవుతుండగా, హిందీలో ‘సామ్రాజ్య’ టైటిల్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.