Catherine Chiru: చిరుతో గ్లామర్‌ బ్యూటీ కేథరిన్.. సంక్రాంతికి డోస్ పెంచేసిన అనిల్!

Catherine Chiru: చిరుతో గ్లామర్‌ బ్యూటీ కేథరిన్.. సంక్రాంతికి డోస్ పెంచేసిన అనిల్!

తనదైన గ్లామర్‌‌‌‌తో యూత్‌‌ను ఆకట్టుకునే కేథరిన్ థ్రెసా మరో లక్కీ చాన్స్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో రెండోసారి అవకాశం అందిపుచ్చుకుంది. ఇప్పటికే చిరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో రవితేజకు జంటగా కనిపించి ఇంప్రెస్ చేసింది.

తాజాగా ఇప్పుడు చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ‘మన శంకరవర ప్రసాద్‌‌గారు’ చిత్రంలోనూ కేథరిన్ కనిపించబోతోంది.  సినిమా అనౌన్స్‌‌మెంట్ దగ్గరనుంచి ఇందులో కేథరిన్ నటించబోతోందని ప్రచారం జరిగింది.

అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ రీసెంట్‌‌గా సెట్‌‌లో టీమ్ అంతా దిగిన ఫొటో ఒకటి బయటకు రావడం, అందులో కేథరిన్ కనిపించడంతో క్లారిటీ వచ్చింది.

ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌‌గా నటిస్తుండగా కేథరిన్ పాత్ర ఎలా ఉండనుందనే దానిపై సోషల్ మీడియాలో ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్స్‌‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. గతంలో ఇదే సంక్రాంతికి చిరంజీవి సినిమాతో ఆకట్టుకున్న కేథరిన్‌‌.. ఈ ఏడాది సంక్రాంతికి కూడా మెగా మూవీతోనే వస్తుండడం విశేషం.