ఏఎంబీ థియేటర్ లో సందడి చేసిన జాన్వీ కపూర్... డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి..

ఏఎంబీ థియేటర్ లో సందడి చేసిన జాన్వీ కపూర్... డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి..

రామ్ చరణ్‌‌‌‌‌‌‌‌, జాన్వీకపూర్ జంటగా బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’.  ఈ మూవీ షూటింగ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనేందుకు ఇటీవల హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వచ్చిన జాన్వీకపూర్.. ఇలా దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఏఎంబీ థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సందడి చేసింది.  ఇందుకు సంబంధించిన ఫొటోస్‌‌‌‌‌‌‌‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ వారంలో రామ్ చరణ్‌‌‌‌‌‌‌‌, జాన్వీ జంటపై ఓ పాటతో పాటు లవ్‌‌‌‌‌‌‌‌ సీన్స్‌‌‌‌‌‌‌‌ చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌‌‌‌‌‌‌‌, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.