Kajal Agarwal: ఆ విషయంలో టాలీవుడ్ మారాలి.. బాలీవుడ్తో పోల్చుతూ కాజల్ కామెంట్స్

Kajal Agarwal: ఆ విషయంలో టాలీవుడ్ మారాలి.. బాలీవుడ్తో పోల్చుతూ కాజల్ కామెంట్స్

ఈమధ్య హీరోయిన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేయడం కామన్ అయిపోయింది. పక్క ఇండస్ట్రీలతో పోల్చుతూ డైరెక్ట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha menon) టాలీవుడ్ ఇండస్ట్రీ మేకప్ విషయంపై కామెంట్స్ చేసింది. ఇప్పుడు తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Agarwal) కూడా టాలీవుడ్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేసింది. ఆ విషయంలో టాలీవుడ్ లో ఎలాంటి మార్పు లేదని, బాలీవుడ్ తో కంపేర్ చేస్తూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. కాజల్ అగర్వాల్ చేస్తున్న లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ. క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటీవ్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాను సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్నాడు. టీజర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే.. మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు యూనిట్. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ టాలీవుడ్ ఇండస్ట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

పెళ్లి తరువాత నా కెరీర్ లో ఎలాంటి మార్పు రాలేదు. బాలీవుడ్ లో పెళ్ళైన హీరోయిన్స్ కూడా ఇపుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ విషయంలో టాలీవుడ్ లో ఎలాంటి మార్పు రాలేదు. ఇక్కడ పెళ్ళైన హీరోయిన్స్ కి ఛాన్స్ ఇవ్వడానికి మేకర్స్ చాలా ఆలోచిస్తారు. త్వరలో ఇక్కడ కూడా ఆ మార్పు వస్తుందని భావిస్తున్నాను. దానికి నేనే ఎగ్జామ్పుల్ అంటూ చెప్పుకొచ్చారు కాజల్. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.