నిన్ను ఇష్టపడటం ఒక మ్యాజిక్‌.. కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్

నిన్ను ఇష్టపడటం ఒక మ్యాజిక్‌.. కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్

ఒకప్పటి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ రాధ(Radha) కూతురు, జోష్(Josh) మూవీ హీరోయిన్ కార్తీక(Karthika) పెళ్లికి రెడీ అయ్యారు. గత నెలలో ఎంగేజ్‌మెంట్‌ పిక్‌ షేర్‌ చేసి ఆశ్చర్యపరిచిన కార్తీక..తన ఇన్స్టా పోస్ట్ లో ఓ వ్యక్తిని కౌగిలించుకోని కనిపించారు. ఈ ఫోటోలో వారిద్దరి మొహాల కంటే..ఆ ఉంగారాన్నే ఎక్కువగా హైలెట్‌ చేయడంతో..పెద్ద ఎత్తున టాక్ నడిచింది. ఇక కార్తీక లేటెస్ట్ పోస్ట్ తో నెటిజన్స్ కు సమాధానం దొరికేసింది. 

హీరోయిన్ కార్తీక తనకు కాబోయే భర్తను ఆఫీసియల్ గా పరిచయం చేసింది. అతడితో చిరునవ్వులు చిందిస్తూన్నకార్తీక ..ఫొటోలు షేర్‌ చేస్తూ.. ‘‘నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడటం ఒక మ్యాజిక్‌.. మన జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభించా’’ అని ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు కాబోయే బ్యూటీ కపుల్స్ కు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. 

ఇక కార్తీక చేసిన సినిమాల విషయానికి వస్తే.. ఆమె తెలుగులో నాగచైతన్య హీరోగా వచ్చిన జోష్ సినిమాతో హీరోయినా గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దమ్ము, అల్లరి నరేష్ బ్రథర్ అఫ్ బొమ్మాలి వంటి సినిమాల్లో నటించారు. అవేవి కూడా ఆశించినంతగా ఆడకపోవడంతో ఆమె కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.