
మహానటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్(Keerthy Suresh) ఆమె వరుస విజయాలతో మళ్లీ ఫామ్ లోకి వస్తోంది. ఇటీవల వచ్చిన ‘దసరా’, ‘మమ్మానమ్’ లాంటి చిత్రాలు కీర్తీని తిరిగి రేస్‌లో నిలబెట్టాయి. వీటి ముందు వరకు ప్లాప్‌లతో పరేషన్ అయిన మహానటి కెరీర్ ఈ సినిమాల బూస్టింగ్‌తో దూసుకుపోతోంది.
ప్రస్తుతం కీర్తీ కోలీవుడ్‌లో నాలుగైదు చిత్రాలు చేస్తోంది. తెలుగులో ‘ భోళా శంకర్‘ సినిమాలో మెగాస్టార్‌కి చెల్లెలు పాత్ర పోషిస్తోంది. ఆమె కలల చిత్రం ఏమైనా ఉందా? ఏ హీరో తోనైనా కలిసి పని చేయాలని కోరుకుంటున్నారా? ఏ దర్శకుడితో పనిచేయాలని ఉందని ప్రశ్నిస్తే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌తో సినిమా చేయాలంటోంది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ సినమా చేయాలని ఉందని చెప్పింది. తన సినీ కెరీర్ ముగిసేలోపు వెండి తెరపై వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాలో పని చేసే ఛాన్స్ తనకే రావాలని దేవుణ్ని కోరుకుంటుందట. వారిద్దరి పిలుపు కోసం వెయిట్ చేస్తున్నా అంటుంది కీర్తీ.