
‘సీతారామం’చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మృణాల్ ఠాకూర్.. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్, కల్కి లాంటి చిత్రాలతో ఆకట్టుకుంది. అజయ్ దేవగన్‌కు జంటగా ఆమె నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ రిలీజ్‌కు రెడీగా ఉంది. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగణ్, జ్యోతి దేశ్‌పాండే నిర్మిస్తున్నారు.
ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా జులై 25న విడుదల కానున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది మృణాల్.
ఇక తాజాగా హైదరాబాద్ చేరుకున్న మృణాల్ ‘డెకాయిట్’ షూటింగ్‌లో జాయిన్ అయినట్లు ఓ ఫోటో షేర్ చేసింది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు.
►ALSO READ | Tharun Bhascker: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా మూవీ అప్డేట్.. ఆసక్తిగా కాన్సెప్ట్ వీడియో
తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూట్‌లో జాయిన్ అయిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది మృణాల్. పచ్చని గడ్డిలో మెట్టెలు పెట్టుకున్న తన కాళ్లు మాత్రమే కనిపించేలా ఉన్న ఓ ఫొటోను ఆమె ఈ సందర్భంగా షేర్ చేసింది. ఇందులో మృణాల్ కాళ్లు మాత్రమే కనిపిస్తుండగా.. మెట్టెలు ఉన్న కాళ్లు చూసి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ ఫీల్ అవుతున్నారు.
తొలుత ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ కాగా.. ఆమె తప్పుకోవడంతో మృణాల్‌ను రీప్లేస్ చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది.