ఆ హీరోను హాగ్ చేసుకున్నా అని..రజినీకాంత్ నాపై సీరియస్ అయ్యాడు

ఆ హీరోను హాగ్ చేసుకున్నా అని..రజినీకాంత్ నాపై సీరియస్ అయ్యాడు

సీనియర్ హీరోయిన్ రంభ (Rambha)..కుర్రాళ్ళ గుండెల్లో కొన్నాళ్లు సేద తీరిన ఫేమస్ హీరోయిన్. ఆ ఇంద్రుడి దగ్గర రంభ ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కానీ, మన తెలుగు కుర్రాళ్లకు మాత్రం కళ్ళ ముందు కనిపించే ఈ రంభ లానే ఉంటుందని ఫిక్స్ అయ్యారు. అప్పట్లోనే పాన్ ఇండియా హీరోయిన్ గా తన స్టామినా ఏంటో నిరూపించింది. లేటెస్ట్ గా రంభ రీఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుందని సమాచారం.

రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రంభ, రజినీకాంత్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. 

”నేను రజినీకాంత్ (Rajinikanth) సర్తో అరుణాచలం మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే..హిందీలో సల్మాన్ ఖాన్ (Salman Khan) బంధన్ మూవీ కూడా చేయాల్సి వచ్చింది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఫుల్ బిజీగా గడిపేదాన్ని. అలా మధ్యాహ్నం వరకు అరుణాచలం సెట్ లో..నైట్ వరకు బంధన్ షూట్ లో పాల్గొనేదాన్ని. ఇలా ఈ రెండు సినిమాల షూటింగ్స్ పక్కపక్కనే జరుగుతుండడంతో..పెద్ద ఇబ్బంది ఏం అనిపించలేదు. కానీ ఒకసారి అనుకోకుండా జరిగిన సంఘటన..ఇప్పటికీ గుర్తొస్తుంటది. 


ఒకసారి హీరో సల్మాన్..అరుణాచలం మూవీ సెట్స్కు వచ్చాడు. అలా ఆయనను చూడగానే వెంటనే వెళ్లి హాగ్ చేసుకొని పలకరించాను. దాన్ని రజినీ సర్ చూసారు. వెంటనే రజినీ సర్.. డైరెక్టర్ సుందర్ సి తో ఏదో మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తరువాత రజినీ సర్.. వచ్చి టవల్ విసిరికొట్టి నాతో ఆగ్రహంతో మాట్లాడారు.కెమెరా మ్యాన్ వచ్చి.. మీరు ఇలా చేయకుండా ఉండాల్సింది, రజినీ సర్.. మీతో కలిసి పనిచేయను అని అంటున్నారు అని అన్నాడు. ఇక నేను ఏడవడం మొదలుపెట్టాను.

అప్పుడు రజినీ సర్ వచ్చి..ఎవరు ఈ అమ్మాయిని ఏడిపించింది అని మండిపడ్డారు. అసలు ఏం జరిగింది.. నేనేం తప్పు చేశాను అని అడిగితే.. ఉదయం సల్మాన్ ను హాగ్ చేసుకున్నది ప్రాక్టికల్గా చూపించి..బాలీవుడ్ హీరో అయితే హాగ్ చేసుకుంటావ్..మాకు అయితే షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చి వెళ్ళిపోతావ్ అని ఆట పట్టించారు. ఇదంతా ముందే సెట్లో ఉన్న వారందరికీ తెలుసు. అలా నన్ను ఆరోజు ఆటపట్టించారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ రంభ పంచుకున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ రంభ 1990 వ దశకంలో తన అందంతో..డ్యాన్స్తో స్టార్ హీరోస్ అందరితో నటించింది. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ మలయాళం, కన్నడ భాషల్లో నటించి ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఉన్నంత సోషల్ మీడియా..అప్పట్లో ఉండింటే..పాన్ ఇండియా రంభ అని పిలుచుకునేవాళ్ళం. 

  • Beta
Beta feature
  • Beta
Beta feature