
హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతోంది రాశీ ఖన్నా. ఇటీవల వచ్చిన తిరు సహా కోలీవుడ్‌లో ఆమె నటించిన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రాశీ మనసు విప్పి మాట్లాడింది. ఇండస్ట్రీకి తాను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చానని.. ఇప్పటికీ గాడ్‌ఫాదర్ లేకుండానే కంటిన్యూ అవుతున్నట్టుగా తెలిపింది.
‘ఓ టైంలో హిట్స్ వచ్చినప్పుడు నా అదృష్టాన్ని చూసుకుని మురిసిపోయా. నేను చేసిన సినిమాలకు తగ్గట్టుగానే అభిమానులను సంపాదించుకోగలిగాను. అయితే, ఇండస్ట్రీతో అంత ఈజీ కాదని తెలుసు. ముఖ్యంగా పరిశ్రమలో నటీమణుల ఫ్యూచర్‌ని అంచనా వేయలేం. అవకాశాలు ఉన్నప్పుడు ఉంటాయి. అవి రాని రోజు దారి కనిపించని పరిస్థితి ఎదురవుతుంది’ అని రాశీ ఖన్నా వివరించింది.