SamyukthaMenon: విపరీతమైన క్రేజ్లో సంయుక్త.. చేతిలో 8కి పైగా సినిమాలు.. అవేంటో చూసేయండి

SamyukthaMenon: విపరీతమైన క్రేజ్లో సంయుక్త.. చేతిలో 8కి పైగా సినిమాలు.. అవేంటో చూసేయండి

‘భీమ్లా నాయక్‌‌’ సినిమాతో టాలీవుడ్‌‌కు పరిచయమై.. బింబిసార, విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్స్‌‌తో క్రేజీ హీరోయిన్‌‌గా పేరు తెచ్చుకుంది సంయుక్త మీనన్​. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉంది. వాటిలో ఓ లేడీ ఓరియెంటెడ్‌‌ సినిమా కూడా ఉంది. ‘చింత‌‌కాయ‌‌ల ర‌‌వి’ ఫేమ్ యోగేష్ కేఎంసీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

దీపావళి సందర్భంగా ఆదివారం ఈ చిత్రానికి ‘ది బ్లాక్ గోల్డ్’ అనే టైటిల్‌‌ను ప్రకటించారు. సోమవారం ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను రివీల్ చేయనున్నట్టు తెలియజేశారు. హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ బ్యానర్స్‌‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సింధు మాగంటి కో ప్రొడ్యూసర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు.

►ALSO READ | AnaganagaOkaRaju: దసరాకి గోదావరి, ఈ దీపావళికి తెలంగాణ యాస.. ప్రమోషన్లతో కేక పుట్టిస్తున్న నవీన్ పొలిశెట్టి

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌‌లో శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు యోగేష్ థ్రిల్లర్ జానర్‌‌‌‌కి కొత్త కాన్సెప్ట్‌‌ను పరిచయం చేస్తూ, ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నట్టు నిర్మాతలు తెలియజేశారు.

ఇందులో  సంయుక్త డైనమిక్ పాత్రలో కనిపించనుందని, ఆమె అద్భుతమైన స్టంట్స్ చేస్తుందని చెప్పారు. ఈ చిత్రానికి ఎ వసంత్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌గా, సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌‌‌‌గా, చోటా కె ప్రసాద్ ఎడిటర్‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో 8కి పైగా సినిమాల్లో నటిస్తుంది. అందులో బాలకృష్ణతో అఖండ 2, పూరీ, విజయ్ సేతుపతి కాంబో, శర్వానంద్ జోడిగా నారీ నారీ నడుమ మురారీ, బెల్లంకొండ శ్రీనివాస్ తో హైందవ, నిఖిల్ జోడిగా స్వయంభు, లారెన్స్ బెంజ్, హిందీలో మహారాణి చిత్రాలు ఉన్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samyuktha (@iamsamyuktha_)