
నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో వరుస అప్డేట్స్ ప్రోమోస్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ని అలర్ట్ చేస్తున్నారు మేకర్స్.
ఇవాళ (అక్టోబర్ 20న) దీపావళి సందర్భంగా ‘దివాళి ఫన్ బ్లాస్ట్ ప్రోమోను’ విడుదల చేశారు. ఇందులో నవీన్ పొలిశెట్టి పోషించిన క్యారెక్టర్, తన లుక్, ఫన్ కంప్లీట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. రాజు గారి దివాళి విందు అంటే ఎలా ఉండాలి? అనేలా చేసిన హడావుడి నవ్వులు పూయించింది.
‘అరే హ్యాపీ దీపావళి అన్నా.. ఏం కావాలి.. ఏమేం దొరుకుతయంటే పట్టుచీరలు, సిల్క్ శారీస్ అన్ని దొరుకుతాయి.. తన దగ్గర పటాకాయల షాపుకి వచ్చి పట్టుచీరలు దొరుకుతాయా అన్నా.. ? రాజు రాకెట్స్ అంటూ నవీన్ పొలిశెట్టి డైలాగ్స్ అదిరిపోయాయి.
నవీన్ వన్ మ్యాన్ స్కెచ్‌లతో ఈ 147 సెకన్ల ప్రోమో సినిమాపై భారీ అంచనాలు పెంచింది. తెలంగాణకు చెందిన దీపావళి క్రాకర్స్ వ్యాపారవేత్తగా, డైలాగ్స్ తో అలరించారు. ముఖ్యంగా, ఇందులో నాగ వంశీ షాట్ ప్రోమోలో మంచి క్యూరియాసిటీ తీసుకొచ్చింది. దసరా ప్రోమోలో గోదావరి యాసలో, ఈ దీపావళి ప్రోమోలో తన రెగ్యులర్ తెలంగాణ యాసతో దుమ్మురేపాడు నవీన్.
మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2026 సంక్రాంతికి రిలీజ్ అవ్వనుంది. ఈ మూవీతో పాటుగా ప్రభాస్ నటించిన రాజా సాబ్తో పాటుగా చిరు-అనిల్ మూవీ, విజయ్ దళపతి జన నాయకుడు (2026 జనవరి 9), రవితేజ-కిషోర్ తిరుమల మూవీస్ ఉన్నాయి.
గతంలో చూసుకుంటే.. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలకు పోటీగా చిన్న హీరోలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి నిరాశ పరచలేదు. దానికితోడు భారీ విజయాలు కూడా నమోదు చేసుకున్నాయి. ఇక ఈసారి కామెడీ స్టార్ నవీన్ సక్సెస్ అందుకోవడం పక్కా అనే చెప్పాలి.
Jaanejigars. ఈ సంక్రాంతికి #AnaganagaOkaRaju తో దద్దరిల్లే నవ్వులు, ఆనందాన్ని తీస్కొతున్నాం ❤️❤️❤️
— Naveen Polishetty (@NaveenPolishety) May 27, 2025
Raju garu ni kalisi హాయిగా కడుపుబ్బా నవ్వుకుందాం..😍
— https://t.co/O946MbSMqv
January 14th, 2026. ❤️❤️❤️
Theatres lo kaluddham 🤗🤗🤗 pic.twitter.com/lMrY5ZTl76