స్వయంభూ కోసం సంయుక్త

స్వయంభూ కోసం సంయుక్త

 తెలుగులో వరుస హిట్స్అందు కుంటూ క్రేజీ  హీరోయిన్‌‌‌‌గా పేరు తెచ్చుకుంది  సంయుక్త మీనన్‌‌‌‌. భీమ్లా నాయక్ మొదలు.. బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్ లాంటి డిఫరెంట్ కాన్సెప్టులను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్‌‌‌‌తో కలిసి ‘స్వయంభూ’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ కోసం సంయుక్త  గుర్రపు స్వారీ నేర్చుకుంటుంది. ఈ సందర్భంగా  గుర్రంపై కూర్చొని ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంయుక్త.. ‘2024లో నా జీవితాన్ని మార్చేసే అనేక విషయాలు నేర్చుకుంటున్నా. 

కంఫర్ట్ జోన్‌‌‌‌లో నేను ఎప్పుడూ లేను. ఇలాంటి కొత్త అనుభవాలను వెతుకుతాను. ప్రస్తుతం ‘స్వయంభూ’ కోసం గుర్రపుస్వారీ నేర్చుకుంటున్నా.  ఇది నాకు ఎంతో సంతోషాన్ని, ప్రశాంతతని ఇస్తుంది’ అని పోస్ట్ చేసింది.  భరత్ కృష్ణమాచారి డైరెక్షన్‌‌‌‌లో రూపొందుతున్న చిత్రంలో  నిఖిల్ యోధుడి పాత్రను పోషిస్తున్నాడు. దీనికోసం మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీని ఇప్పటికే ట్రైనింగ్  తీసుకున్నాడు నిఖిల్. తాజాగా సంయుక్త కూడా ఈ ట్రైనింగ్ తీసుకోవడంతో సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమంటున్నారు మేకర్స్. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లో వేసిన భారీ సెట్‌‌‌‌లో షూటింగ్‌‌‌‌ జరుగుతోంది.  ఠాగూర్ మధు సమర్పణలో  భువన్, శ్రీకర్ ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.