సీఎంఆర్​ షాపింగ్ ​మాల్​ ఓపెనింగ్​లో హీరోయిన్ శ్రీలీల సందడి

సీఎంఆర్​ షాపింగ్ ​మాల్​ ఓపెనింగ్​లో హీరోయిన్ శ్రీలీల సందడి

మాదాపూర్​, వెలుగు : కూకట్​పల్లిలో శనివారం ఉదయం హీరోయిన్​ శ్రీలీల సందడి చేశారు. సీఎంఆర్ షాపింగ్​మాల్​ఓపెనింగ్​కు ఆమె రాగా చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్​చేరుకొని సందడి చేశారు. వీవీనగర్​ మెయిన్​రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన సీఎంఆర్​షాపింగ్​15వ మాల్​ను శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

 అనంతరం మాల్​లోని బంగారు అభరణాలు, చీరలను చూసి ధరించి సంతోషం వ్యక్తంచేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు, ఎమ్మెల్సీ నవీన్​కుమార్​ కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.