ఎమర్జెన్సీ వాడకానికి మోల్నుపిరావిర్‌‌ దరఖాస్తు

ఎమర్జెన్సీ వాడకానికి మోల్నుపిరావిర్‌‌ దరఖాస్తు
  • మోల్నుపిరావిర్‌‌ డ్రగ్​కు అనుమతివ్వండి
  • దేశంలో ఎమర్జెన్సీ వాడకానికి అప్లై చేసుకున్న హెటిరో ల్యాబ్స్
  • మైల్డ్ కేసుల్లో ఈ మందుతో రికవరీ బాగుందని వెల్లడి

బెంగళూరు: అమెరికన్ కంపెనీ మెర్క్ తయారు చేసిన యాంటీ వైరల్ మెడిసిన్ మోల్నుపిరావిర్ ను మన దేశంలో ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఇవ్వాలంటూ డీసీజీఐకి అప్లికేషన్ పెట్టుకున్నట్లు శుక్రవారం హెటిరో ల్యాబ్స్ వెల్లడించింది. మోల్నుపిరావిర్ మందు మైల్డ్ సింప్టమ్స్ ఉన్న కరోనా పేషెంట్లు త్వరగా కోలుకునేందుకు బాగా ఉపయోగపడుతుందని, పేషెంట్లు హాస్పిటల్ లో చేరాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని లేట్ స్టేజ్ ట్రయల్స్ లో వెల్లడైనట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రులలో ఈ మందుతో ట్రయల్స్ జరిగాయని, మందు పనితీరు, సేఫ్టీ విషయంలో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది. ట్రయల్స్ లో భాగంగా మోల్నుపిరావిర్ ను వాడిన కరోనా పేషెంట్లలో దవాఖానలో చేరినవారి సంఖ్య తగ్గిందని, అలాగే మైల్డ్ డిసీజ్ ఉన్న పేషెంట్లు ఫాస్ట్ గా కోలుకున్నారని వివరించింది. ఈ మందును ఇండియాతో సహా 100 దేశాల్లో మార్కెటింగ్ చేసేందుకు హెటిరో, సిప్లా, రెడ్డీస్ ల్యాబ్ లకు లైసెన్స్ లు ఇచ్చామని, ఆయా దేశాల్లో ఎమర్జెన్సీ యూజ్ కు అనుమతి వచ్చాక మందు సప్లై ప్రారంభమవుతుందని మెర్క్ ఇదివరకే ప్రకటించింది.