దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్‌

దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్‌

దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) వ్యతిరేకంగా ఆందోళనలతో పాటు మరింత హింసాకాండ పెరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ అధికారులు జారీ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు బుధవారం హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్, అన్ని జిల్లాల డీసీపీలు, జాయింట్ కమిషనర్ల సమావేశంలో అల్లర్లు జరుగుతాయని ఇంటలిజెన్స్ చేసిన హెచ్చరికలపై సమీక్షించారు. ఢిల్లీలోని శీలంపూర్, ముస్తఫాబాద్ ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలు జరగనున్నట్లు సమాచారం.  అంతేకాదు నగరంలోని మరో 12 సున్నిత ప్రాంతాల్లో ఈ వారంలో అల్లర్లు జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో  ఆయా ప్రాంతాల్లో సాయుధ పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. అమన్ కమిటీ సభ్యులతో కలిసి పోలీసులు అల్లర్లు జరగకుండా పెట్రోలింగ్ చేపట్టాలని నిర్ణయించారు.

More News

అదే తరహాలో 9 హత్యలు చేసిన దిశ నిందితులు?
సీఎం కేసీఆర్ ఏడాది పాలనపై ప్రజా తీర్పు !!
పౌరసత్వ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ