
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్‌కు ఇటీవల గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరించాడని తెలిసింది. గతంలో కృష్ణ జింకను వేటాడి దానిని ఆరాధించే మత గురువుల విశ్వాసాలను దెబ్బ తీశాడని బిష్ణోయ్ ఆరోపణ. బిష్ణోయ్ కూడా మత విశ్వాసాలను కలిగి ఉండటమే ఈ బెదిరింపులకు కారణమని తెలుస్తోంది. తన వర్గానికి సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించడం తెలిసిందే. కాగా సల్మాన్ ఖాన్ జోద్‌పూర్‌లోని కోర్టుకు వెళ్లాలంటే హై సెక్యూరిటీ అవసరం. ఏకంగా పది కోట్లు ఖర్చు చేసి వ్యక్తిగతంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటాడని సమాచారం. తాజాగా సల్మాన్ ఖాన్ ను బెదిరిస్తూ పలు ఇమెయిల్ వచ్చాయి. బిష్ణోయ్, గోల్డీబ్రార్ రోహిత్‌పై కేసు నమోదైంది.