పెద్దపల్లి జిల్లా మంథని పోలీసు స్టేషన్‌లో మంగళవారం రంగయ్య అనే వ్యక్తి కస్టడియల్ డెత్ కు గురైన ఘటనపై హైకోర్టు విచారణ చేపట్టింది. కస్టడియల్ డెత్ ఘటన పై న్యాయవాది నాగమణి హైకోర్టుకు లేఖ రాయడంతో. . ఆ లేఖ ను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది.
కస్టడియల్ డెత్ పై ఎంక్వైరీ కమిషన్ ను ఆదేశించిన హైకోర్టు… ఎంక్వయిరీ కమిషన్ అధికారిగా హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ ని నియమించింది. జాన్ 2 వరకు కస్టడియల్ డెత్ పై సమగ్ర నివేదిక అందించాలని ఎంక్వయిరీ కమిషన్ కు ఆదేశమిస్తూ.. తదుపరి విచారణను జూన్ 2 కు వాయిదా వేసింది.
వన్య ప్రాణులను వేటాడుతున్నడన్న సమాచారంతో రామగిరి మండలం రామయ్య పల్లి గ్రామానికి చెందిన రంగయ్య అనే వ్యక్తితో పాటు మరో నలుగురిని పోలీసులు మూడు రోజుల క్రితం అరెస్టు చేశారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో స్టేషన్ లోనే రంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. కస్టడియల్ డెత్ కావడంతో కోర్టుకు లేఖ రాయగా బుధవారం విచారణ చేసింది.

