రిజిస్ట్రేషన్‌లో ఆధార్ వివరాలెందుకు? హైకోర్టు ప్రశ్న..

రిజిస్ట్రేషన్‌లో ఆధార్ వివరాలెందుకు? హైకోర్టు ప్రశ్న..

రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆధార్ వివరాలు ఎందుకు అడుగుతున్నారని ప్రభుత్వం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు‌పై హైకోర్టులో విచారణ మొదలైంది. ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై కౌంటర్ అఫిడవిట్‌ను ప్రభుత్వం దాఖలు చేసింది. కాగా.. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలంటే 29 పేజీలలో వివరాలు అడుగుతున్నారని పిటీషనర్లు కోర్టుకు తెలిపారు. ఆ 29 పేజీలలో వివరాలు నమోదు చేస్తేనే.. స్లాట్ బుక్ అవుతుందని కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన హైకోర్టు.. స్లాట్ బుకింగ్‌కు 29 పేజీల వివరాలు తీసుకోవడం అవసరమా అని ప్రశ్నించింది. స్లాట్ బుకింగ్ పేరుతో కొనుగోలు దారులు మరియు అమ్మకం దారుల వ్యక్తిగత వివరాలు తీసుకుంటున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. రిజిస్ట్రేషన్ కోసం కుటుంబ సభ్యులు మరియు సాక్షుల ఆధార్ కార్డ్ వివరాలు, ఫోన్ నెంబర్లు ఎందుకు తీసుకుంటున్నారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయినా రిజిస్ట్రేషన్లు పాత పద్దతిలోనే చేస్తామని కోర్టుకు చెప్పిన ప్రభుత్వం.. అలా కాకుండా తాను అనుకున్నదే చేస్తుందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆధార్ కార్డ్ ప్రస్తావన రాకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ధరణి పోర్టల్‌లో ఆధార్ కార్డ్ కాలంను తొలగించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మధ్యాహ్నం సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30కు వాయిదా వేసింది.

For More News..

వీడియో: భుజాలపై చేతులేసుకొని వెళ్తున్న స్నేహితులు.. ఒకరి మీద కూలిన పిల్లర్

వీడియో: ఫ్లైట్ నుంచి కింద పడ్డ ఐఫోన్.. అయినా దొరికింది

స్మగ్లర్ల మహాతెలివి.. బస్సులో వైట్ డ్రెస్.. తిరుమలలో కాషాయం.. అడవిలో టీషర్ట్