
యాదగిరిగుట్ట, వెలుగు: పూర్తిగా కృష్ణశిలతో సప్తగోపుర సముదాయంగా పునర్నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం అద్భుతంగా ఉందని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు.
శనివారం ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఉత్సవ మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం మంచిర్యాల జిల్లా నర్సాపూర్ లో కోర్టు సముదాయానికి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.