రామప్పలో హైకోర్టు చీఫ్ జస్టిస్ పూజలు

రామప్పలో హైకోర్టు చీఫ్ జస్టిస్ పూజలు

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్​లో రామ లింగేశ్వరుడిని ఆదివారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ మండపంలో చీఫ్​ జస్టిస్​ను సన్మానించగా.. ఈవో బిల్లా శ్రీనివాస్ మెమెంటో బహుకరించారు. రామప్ప చరిత్ర, 

శిల్పకళా ప్రాముఖ్యతను గైడ్, అసిస్టెంట్ టూరిజం ఆఫీసర్ కుసుమ సూర్య కిరణ్ వివరించారు. చీఫ్​ జస్టిస్​ అక్కడ నీటిలో తేలే ఇటుకలను ఆసక్తిగా పరిశీలించారు. కాకతీయ డోజర్, రామ ప్ప హిస్టరీ పుస్తకాలను బహుకరించారు. తర్వాత రామప్ప లేక్ లో బోటింగ్ చేశారు. హైకోర్టు రిజి స్ట్రార్లు నరసింహారావు, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ములుగు జిల్లా జడ్జి లలితా శివజ్యోతి, జడ్జిలు మాధవి, రామ్మోహన్ రెడ్డి, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, డీఎస్పీ రవీందర్, తహసీల్దార్​సదానందం, ఎస్సై చల్ల రాజు, న్యాయవాదులు వేణుగోపాలా చారి, వినయ్ కుమార్, రవీందర్,  మహేందర్ ఉన్నారు. 

గట్టమ్మ తల్లికి పూజలు 

ములుగు : అంతకుముందు ములుగు సమీపం లోని గట్టమ్మ తల్లిని చీఫ్​ జస్టిస్​ దర్శించుకున్నారు. ములుగు జిల్లా జడ్జి పి.వి.పి.లలితా శివజ్యోతి, సీనియర్​ సివిల్​జడ్జి టి.మాధవి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాన పూజారి కొత్త సదయ్య అమ్మవారి పసుపు, కుంకుమ అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని పూజారులు వినతిపత్రం అందజేశారు. ప్రధాన పూజారులు కొత్త సదయ్య, కొత్త లక్ష్మయ్య, ఆకుల మొగిలి, అరిగెల సమ్మయ్య, ఆకుల పుల్లయ్య, చిర్ర రాజేందర్, అరిగెల సంజీవ, ఆకుల రఘు, రవి, రమేశ్​​, ఆదివాసీ నాయకపోడ్​ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ​పాల్గొన్నారు.