లీగల్ ఎయిడ్ డిఫెన్స్ సిస్టం ప్రారంభించిన హైకోర్టు సీజే

లీగల్ ఎయిడ్ డిఫెన్స్ సిస్టం ప్రారంభించిన హైకోర్టు సీజే

లీగల్ ఎయిడ్ డిఫెన్స్ సిస్టమ్ తెలంగాణలో అందుబాటులోకి తీసుకురావడంపై హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ను ఆయన ఆవిష్కరించారు. ప్రస్తుతం జైళ్లలో 80శాతం మంది అండర్ ట్రయిల్ ఖైదీలు ఉన్నారని సీజే చెప్పారు. అణగారిన వర్గాల ఖైదీలకు ఈ లీగల్ ఎయిడ్ సిస్టం సాయం అందిస్తుందని అన్నారు. చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ తో పాటు అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్లు తరుచూ జైళ్లకు వెళ్లి అవసరం ఉన్న ఖైదీలకు సాయం చేస్తారని జస్టిల్ ఉజ్జల్ భూయాన్ ప్రకటించారు. త్వరలోనే మరిన్ని జిల్లాలకు ఈ వ్యవస్థను విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.