
హైదరాబాద్, వెలుగు: చిన్న చిన్న వివాదాలనూ కోర్టులకు లాగుతూ అతి పెద్ద కక్షిదారుగా ఎస్‌బీఐ ఉందని హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. డీఆర్‌టీ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలుకు 542 రోజులు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా అప్పీళ్లతో కాలయాపన చేస్తోందని మండిపడింది. లోన్ కు సంబంధించి రైతులు మాధవ రెడ్డి, ఎన్.బాల్‌రెడ్డిలకు అనుకూలంగా ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేసూ ఎస్‌బీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. బ్యాంకు తరఫు న్యాయవాది వాదిస్తూ..గతంలో ఉన్న న్యాయవాది అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకాలేకపోయారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ పిటిషన్ దాఖలులో జాప్యానికి కారణాలు పేర్కొనకపోవడాన్ని తప్పుబట్టింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది