కరెంట్ బకాయిల ఫైల్స్ ఇవ్వండి  కేంద్రానికి హైకోర్టు ఆదేశం

కరెంట్ బకాయిల ఫైల్స్ ఇవ్వండి  కేంద్రానికి హైకోర్టు ఆదేశం
  • కరెంట్ బకాయిల ఫైల్స్ ఇవ్వండి  కేంద్రానికి హైకోర్టు ఆదేశం
  • ఏ ప్రాతిపదికన ఏపీకి తెలంగాణ బకాయిలు చెల్లించాలి?: హైకోర్టు
  • తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా


హైదరాబాద్, వెలుగు: ఏ ప్రాతిపదికపై తెలంగాణ విద్యుత్‌‌‌‌‌‌‌‌  బకాయిల సొమ్మును ఏపీకి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారో వాటికి చెందిన ఫైల్స్  తమకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్రం ఫైళ్లు సమర్పించాక వాటిని చూసిన తర్వాతే తెలంగాణ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను జూన్‌‌‌‌‌‌‌‌ 9కి వాయిదా వేస్తూ చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌‌‌‌‌  తుకారాంజీతో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నుంచి విద్యుత్‌‌‌‌‌‌‌‌  పొందిన తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.7 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌‌‌‌‌‌‌‌  చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌  ఇటీవల మరోసారి విచారణకు వచ్చింది. విద్యుత్‌‌‌‌‌‌‌‌  ఉత్పత్తి సరఫరా నిమిత్తం ఏపీకి బకాయిలు సొమ్ము అసలు రూ.3441.78 కోట్లు, చెల్లింపులు ఆలస్యం చేసినందుకు సర్‌‌‌‌‌‌‌‌చార్జి  మొదలైవ వాటి నిమిత్తం రూ.3315.14 కోట్లు కలిపి మొత్తం రూ.6756.92 కోట్లు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిరుడు ఆగస్టు 29న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ ఆదేశాలను సవాలుచేస్తూ తెలంగాణ సర్కారుతో పాటు విద్యుత్‌‌‌‌‌‌‌‌  సంస్థలు కూడా హైకోర్టులో పిటిషన్లు వేశాయి. ఏపీ పునర్‌‌‌‌‌‌‌‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం దక్షిణ ప్రాంతీయ మండలిలో రెండు రాష్ట్రాలు చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలన్న నిబంధనను కేంద్రం ఉల్లంఘించిందని తెలంగాణ వాదిస్తున్నది. తెలంగాణ తరపున సుప్రీంకోర్టు సీనియర్‌‌‌‌‌‌‌‌  అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌  వైద్యనాథన్‌‌‌‌‌‌‌‌ వాదిస్తారని, విచారణను వాయిదా వేయాలని కోరింది. కాగా, తెలంగాణకు విద్యుత్‌‌‌‌‌‌‌‌  సరఫరా చేయాలని కేంద్రం ఆదేశించినప్పుడు ఆ చట్టం గురించి చెప్పని తెలంగాణ ఇప్పుడు బకాయిల చెల్లింపు విషయంలో ఆ చట్టాన్ని ప్రస్తావించడం చెల్లదని ఏపీ వాదిస్తోంది.