వినియోగదారుల కమిషన్‌ ‌ఉత్తర్వులను పరిశీలించండి : హైకోర్టు

వినియోగదారుల కమిషన్‌ ‌ఉత్తర్వులను పరిశీలించండి : హైకోర్టు
  • అలయన్స్‌‌ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌‌ జారీ చేసిన ఉత్తర్వుల అమలు నిమిత్తం బాధితులు సమర్పించిన వినతి పత్రాన్ని పరిశీలించి వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వానికి చెందిన చెందిన అలయన్స్‌‌ ఎయిర్ ఏవియేషన్‌‌ లిమిటెడ్‌‌కు మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విమానం రద్దుతో నష్టపోయారని, కంపెనీ సేవల లోపానికిగాను రూ.12.80 లక్షలు చెల్లించాలని హైదరాబాద్‌‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌‌ ఉత్తర్వులు అమలు చేయకపోవడాన్ని సవాల్​చేస్తూ శ్యామ్‌‌సుందర్‌‌ లహోటి మరో 31 మంది హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. 

పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది దీపక్‌‌ మిశ్రా వాదనలు వినిపిస్తూ.. ఎయిరిండియా విమానం రద్దు కారణంగా సెలవు ప్రణాళికలు దెబ్బతినడంతోపాటు తిరుగు ప్రయాణం టిక్కెట్‌‌లు, హోటళ్ల రద్దుతో నష్టం జరగడంతో బాధితులు జిల్లా వినియోగదారుల కమిషన్‌‌ను ఆశ్రయించగా రూ.12.80 లక్షలను12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించినా అమలు చేయడం లేదన్నారు.