టికెట్ల ధరలు పెంచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

V6 Velugu Posted on Dec 01, 2021

తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతివ్వాలని థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ప, తదితర భారీ బడ్జెట్ సినిమాలకు ఒక్కో టికెట్ పై రూ.50 పెంచేందుకు అనుమతివ్వాలని థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో.. యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దాంతో యాజమాన్యాల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. దాంతో భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల ధరలు పెరగనున్నాయి.

Tagged Telangana, high court, Movies, theaters, ticket price, cinima ticket price

Latest Videos

Subscribe Now

More News