హైకోర్టులో తెలంగాణ సర్కారు‌కు ఎదురు దెబ్బ

హైకోర్టులో తెలంగాణ సర్కారు‌కు ఎదురు దెబ్బ

5100 రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు స్టే

తెలంగాణ కేబినెట్ 5100 రూట్లలో ప్రైవేట్ బస్సులను నడపాలని తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేయడాన్ని సవాలు చేస్తూ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్ రావ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 5100 ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాన్ని నిలిపి వేయాలని పిటిషనర్ కోరారు. ఆ పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, ప్రభుత్వ వాదనతో అసంతృప్తి చెంది.. 5100 రూట్ల ప్రైవేటీకరణకు స్టే విధించింది. అలాగే తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుకు సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను కోర్టు సోమవారం నాటికి వాయిదా వేసింది.