భద్రాచలం ఎన్నికలపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భద్రాచలం ఎన్నికలు నిర్వహించడం లేదన్న పిల్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. భద్రాచలం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్.వీరయ్య పిల్ దాఖలుచేశారు. భద్రాచలం పంచాయతా..? మున్సిపాలిటా? ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదని ఎస్ఈసీ కోర్టుకు తెలిపింది. పలుమార్లు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పింది. అయిదేళ్లుగా ఎన్నికలు నిర్వహించక పోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భద్రాచలం ఎన్నికలపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. వివరణ ఇవ్వకపోతే సీఎస్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విచారణను మరో నాలుగు వారాలకు వాయిదా వేసింది కోర్టు.
