హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ ఉదంతాన్ని వర్మ.. మర్డర్ అనే సినిమా రూపంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినిమాను ఆపాలని నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించారు ప్రణయ్ భార్య అమృత, ప్రణయ్ తండ్రి బాలస్వామి. దీంతో జిల్లా ఎస్సి, ఎస్టీ కోర్టు ఆదేశాల మేరకు మిర్యాలగూడ వర్మపై పీఎస్ లో కేసు నమోదైంది.
అయితే ఈ కేసును సవాలు చేస్తూ వర్మ హైకోర్టు ను ఆశ్రయించారు. మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు రాంగోపాల్ వర్మ, కరుణ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

