బండి సంజయ్ పిటిషన్పై విచారణ వాయిదా

బండి సంజయ్ పిటిషన్పై విచారణ వాయిదా

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింపుపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింపుపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. బీజేపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ విచారణలో భాగంగా ప్రభుత్వం వాదనలు వినిపించింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పోలీసులు యాత్రకు నిరాకరించారని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. యాత్రలో బండి సంజయ్ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. ఆయన కామెంట్ల వల్ల మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందనే పాదయాత్రకు అనుమతి నిరాకరించినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. 

ప్రభుత్వ వాదనపై స్పందించిన న్యాయస్థానం 22 రోజుల పాటు పాదయాత్ర కొనసాగిన తర్వాత ఇప్పడు అనుమతి చెప్పడమేంటని ప్రశ్నించింది. ఏ కారణాల వల్ల యాత్ర నిలిపేశారో ఆధారాలను రేపటిలోగా సమర్పించాలని ఆదేశించింది. తమ దగ్గర ఉన్న వీడియోలను రేపు.10.30 గంటలకు కోర్టు ముందుంచుతామని తరుపు న్యాయవాది న్యాయమూర్తికి చెప్పారు. దీంతో న్యాయస్థానం కేసు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. తాము చేపట్టిన పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని అందులో పేర్కొంటూ బీజేపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. యాత్రను మధ్యలో నిలిపివేయాలంటూ నోటీసులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. పాదయాత్రకు అనుమతిలిచ్చేలా ఆదేశించాలని న్యాయమూర్తిని కోరారు. పిటీషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

బండి సంజయ్ ప్రస్తుతం జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించిన ఘటనలో బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఆయన దీక్షకు దిగారు. దీక్షను భగ్నం చేసిన పోలీసులు బండి సంజయ్ ను వెంటనే పాదయాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో బండి పాదయాత్ర చేపడితే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని చెప్పారు. పర్మిషన్ లేకుండా యాత్ర చేపడితే జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాలని పోలీసులు హెచ్చరించారు.