కొదురుపాక జీపీ రిజర్వేషన్పై హైకోర్టులో విచారణ

కొదురుపాక జీపీ రిజర్వేషన్పై హైకోర్టులో విచారణ

బోయినిపల్లి, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్​పై సోమవారం హైకోర్టులో విచారణ కొనసాగింది. గ్రామానికి చెందిన కత్తెరపాక సుధాకర్​రిజర్వేషన్​పై హైకోర్టులో రిట్​పిటిషన్ దాఖలు చేశారు. వరుసగా రెండుసార్లు మహిళా రిజర్వేషన్ రావడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ పిటిషన్ వేశారు. పిటిషనర్​తరఫున అడ్వకేట్ తీగల రాంప్రసాద్​తన వాదనలు వినిపించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో జనరల్ మహిళకు రిజర్వేషన్​ కాగా, ఈసారి ఎస్సీ మహిళకు రిజర్వేషన్​కు కావడం, జీవో నంబర్ 46 రూల్​ 4 (3) కి విరుద్ధమన్నారు. రిజర్వేషన్​రొటేషన్​విధానాన్ని పాటించకుండా గెజిట్ మార్చడం అన్యాయమని కోర్టుకు వివరించారు. ప్రభుత్వం తరుపున స్పెషల్​గవర్నమెంట్​అడ్వకేట్​రాహుల్​రెడ్డి సమాధానమిస్తూ మండలంలోని 23 గ్రామాల్లో మహిళా రిజర్వేషన్​50 శాతం నిబంధన నెరవేర్చేందుకు 11 గ్రామాలకు మహిళా రిజర్వేషన్​ కేటాయించాల్సి వచ్చిందని, అందులో కొదురుపాక ఒకటని పేర్కొన్నారు.