ప్రతి గల్లీ నుంచి ఓ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావాలి  : ఈవీ వేణుగోపాల్

ప్రతి గల్లీ నుంచి ఓ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావాలి  : ఈవీ వేణుగోపాల్

కరీంనగర్ టౌన్,వెలుగు: పుట్టిన నేల  గర్వపడేలా రాణించాలని హైకోర్టు జడ్జి ఈవీ వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. ఆదివారం సివిల్ సర్వీసెస్ డేను పురస్కరించుకుని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంకమ్మతోటలోని తన నివాసంలో సివిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో   ర్యాంకులు సాధించిన నందాల సాయికిరణ్(27వ) ​, కొలనుపాక సహన(739)ను  జడ్జి సన్మానించి రాజ్యంగ పుస్తకాన్ని బహూకరించారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ సివిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవగాహన  కల్పించి, ప్రతీ గల్లీ నుంచి  ఓ ఐఏఎస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తయారు చేయాలని పిలుపునిచ్చారు. సివిల్ ర్యాంకర్లను యువత ఆదర్శంగా తీసుకొని ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. జడ్జి  కె.వెంకటేశ్, కార్పొరేటర్ మహేశ్,  అంజనీప్రసాద్ పాల్గొన్నారు.