లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న .. ఏపీ హైకోర్టు జడ్జి మల్లికార్జునరావు

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న .. ఏపీ హైకోర్టు జడ్జి మల్లికార్జునరావు

మఠంపల్లి, వెలుగు : మండలంలోని మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామిని గురువారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి మల్లికార్జునరావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ పాలకమండలి సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

 ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయకుమార్, ఈవో నవీన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.