కాళేశ్వరంలో హైకోర్టు జడ్జి పూజలు

కాళేశ్వరంలో హైకోర్టు జడ్జి పూజలు

మహదేవపూర్, వెలుగు : భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌‌ మండలం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాన్ని శనివారం హైకోర్టు జడ్జి నామవరపు రాజేశ్వరరావు సందర్శించారు. ఉదయం కుటుంబసమేతంగా వచ్చిన ఆయనకు సూపరింటెండెంట్‌‌ బుర్రి శ్రీనివాస్‌‌, అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదాశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అనంతరం మహదేవపూర్‌‌లో జూనియర్‌‌ సివిల్‌‌ జడ్జి కోర్టు బిల్డింగ్‌‌ను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ రాంమోహన్‌‌రెడ్డి, మహదేవపూర్ సీఐ రాజేశ్వర్‌‌రావు, కాళేశ్వరం ఎస్‌‌సై భవానీసేన్, మహదేవపూర్‌‌ ఎస్సై ప్రకాశ్‌‌, ఇన్‌‌చార్జి తహసీల్దార్‌‌ కృష్ణ ఉన్నారు.