పనులు ఆపాలని కలెక్టర్​,ఆర్డీవో, తహసీల్దార్‌‌కు హైకోర్టు నోటీసులు

పనులు ఆపాలని కలెక్టర్​,ఆర్డీవో, తహసీల్దార్‌‌కు హైకోర్టు నోటీసులు

నాగర్​ కర్నూల్, ​వెలుగు: నాగర్​ కర్నూల్​ మెడికల్​ కాలేజీ పనులకు బ్రేక్ పడింది.  పరిహారం చెల్లించకుండా తన భూమి తీసుకున్నారని కొక్కనూరి మధు అనే దళితుడు హైకోర్టును ఆశ్రయించగా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.​ ఉయ్యాలవాడ సమీపంలోని సర్వే నెం.237లో దళితులకు సంబంధించిన 77 ఎకరాల అసైన్డ్​ పట్టా భూముల్లో నుంచి  40 ఎకరాలు సేకరించిన అధికారులు.. 33 ఎకరాలు కాలేజీకి కేటాయించారు.

అయితే భూసేకరణ  ప్రైవేట్ వ్యక్తుల చేతుల మీదుగా జరగడంతో వివాదం నెలకొంది.  వాళ్లే బాధితులతో ఫారం 6 మీద  సంతకాలు పెట్టించి.. గవర్నమెంట్‌కు సరెండర్​ చేయించారు. నిరుడు అడిషనల్ కలెక్టర్​(రెవెన్యూ) చాంబర్‌‌లో సంతకాల  ప్రక్రియ ముగిసిన తర్వాత  డబ్బులు చెల్లించారు. కాగా, రెవెన్యూ అధికారులు చట్టాలను విస్మరించి.. బాధితులకు నోటీసులు ఇవ్వకుండా, పరిహారం చెల్లించకుండా భూసేకరణ చేయడంపై రైతు మధు కోర్టుకు వెళ్లాడు.